రూ.700 లకే నెలంతా సినిమాలు.. సినీ లవర్స్కు PVR బంపరాఫర్

రూ.700 లకే నెలంతా సినిమాలు.. సినీ లవర్స్కు PVR బంపరాఫర్

మన ఇండియన్స్ కు సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు.. అదొక ఎమోషన్. మనవాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా సినిమాకి వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఒక సినిమా నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. అంతలా సినిమా అంటే పది చస్తారు మన ఆడియన్స్ కానీ.. ఇప్పుడు దానికి పూర్తి బిన్నంగా మారిపోయింది. ఒక సినిమాను ఒకసారి చూడటమే గగనంగా మారిపోయింది. టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి. అయినప్పటికీ సినిమా చూడటం అనేది ప్రతీ ఒక్కరికీ అలవాటుగా మారిపోయింది. 

అలా సినిమా అంటే ఇష్టపడేవారికి ప్రముఖ థియేటర్స్ సంస్థ పీవీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.700 లకే నెలంతా సినిమాలు చేసే అవకాశాన్ని కలిపిస్తున్నారు. ప్రేక్షకుల కోసం మూవీ పాస్‌ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం నార్త్ లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సౌత్ లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ విధానంలో రూ.699 కే మూవీ పాస్ అందించనున్నారు. ఈ పాస్ తో నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. అదేంటంటే.. ఈ పాస్ సోమవారం నుండి గురువారం రోజుల్లో మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో ఈ పాస్ చెల్లదు. 

ఇక ఈ పాస్ రిజిస్ట్రేషన్ పనులు కూడా ఇప్పటికి మొదలయ్యాయి కానీ.. పాస్ లు ఎప్పటినుండి అందుబాటులోకి వస్తాయి అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి సినిమా లవర్స్ కి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. పీవీఆర్ థియేటర్స్ లో మినిమమ్ టికెట్ ధర రూ.250 నుండి ఉంటుంది ఆ లెక్కన  పది సినిమాలంటే కనీసం రూ.2500 వరకు అవ్వొచ్చు. అలా చూసుకుంటే ఈ పాస్ ద్వారా దాదాపు  రూ.1800 వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మీరు కూడా సినిమా లవర్ అయితే వెంటనే పీవీఆర్ మూవీ పాస్ తీసుకొండి.