ఎలన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ (Pyaar Prema Kalyanam). శాన్వీ మేఘన హీరోయిన్‌గా రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. శ్రీనిధి సాగర్ నిర్మించారు. ఆగస్టు 21 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ ఎలన్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. పెళ్లి తర్వాత అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళితే ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు అనేది ఫన్నీగా చూపించాం. 32 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. శాన్వీ చాలా సపోర్ట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను చక్కగా రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నా’ అని చెప్పాడు.
Epdi irrundhen naa, ipdi aaiten pic.twitter.com/u1fWmdD3Bd
— Netflix India South (@Netflix_INSouth) August 11, 2026
శాన్వీ మేఘన మాట్లాడుతూ ‘నాలుగేళ్ల క్రితం ‘పిట్ట కథలు’ అనే ఆంథాలజీలో యాక్ట్ చేశాను. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఆ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజైంది. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే రాబోతోంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పింది. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చెప్పే ప్రయత్నమే ఈ చిత్రమని నిర్మాత శ్రీనిధి సాగర్ అన్నారు.
