దేశపు మనుగడను మార్చే ప్రేమ కథ.. క్వీన్

దేశపు మనుగడను మార్చే ప్రేమ కథ.. క్వీన్

సోషల్ మీడియా ఇన్సుయెన్సర్ యామినీ ఈ ఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఉత్తర, ఆర్టిస్ట్ చిత్రాల దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం 'క్వీన్'. వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. "రాళ్లపై పేర్లతో కొన్ని ప్రేమ కథలు..తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ ఈసారి దేశపు మనుగడను మార్చే దారిలో కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ" అని చెబుతూ భారత రాజ్యాంగం, ఆర్ టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్ యాక్ట్ ఆఫ్ లవ్ లాంటివి చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. తను ప్రేమించిన వ్యక్తి కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ అమ్మాయి ఏం చేసింది అనేది స్ఫూర్తి కలిగించేలా చూపిస్తున్నామని దర్శకుడు రతన్ రిషి చెప్పారు. వన్ సర్కిల్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.