జాతి రత్నాలు, డీజే టిల్లు తరహాలో అనుమాన పక్షి సినిమా: రాగ్ మయూర్

జాతి రత్నాలు, డీజే టిల్లు తరహాలో అనుమాన పక్షి సినిమా: రాగ్ మయూర్

రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’  ఫేమ్ విమల్ కృష్ణ రూపొందించిన చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్‌‌‌‌. రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలకపాత్రలు పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్‌‌‌‌. ఈ సందర్భంగా రాగ్ మయూర్ మాట్లాడుతూ ‘ఇదొక మల్టీ జానర్స్‌‌‌‌ సినిమా.  కామెడీతో మొదలై మిస్టరీ జానర్‌‌‌‌లోకి వెళ్లి థ్రిల్లర్, హారర్ టచ్‌‌‌‌తో ఎంగేజింగ్‌‌‌‌గా ఉంటుంది. 

అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కించే సన్నీ పాత్రలో కనిపిస్తా.   కశ్మీర్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌ను ఫస్ట్ టైం ఒక లైట్ హార్టెడ్ కామెడీకి వాడాం. పహల్గాం ఘటన తర్వాత అక్కడ షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే.  ఇందులో ఎమోషన్ ఏమీ ఉండదు. కామెడీ, థ్రిల్, ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంటే ఉంటుంది. మెసేజ్ కూడా ఉంది.

‘డీజే టిల్లు’ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ తర్వాత విమల్ కృష్ణకి ఇంకా పెద్ద హీరో దొరుకుతారు. కానీ నాతో సినిమా చేశారు. తన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. ఫస్ట్ కాపీ చూశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. జాతి రత్నాలు, డీజే టిల్లు తరహాలో అందర్నీ అలరించే సినిమా అవుతుంది’ అని చెప్పాడు.