తప్పించుకు తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్ అరెస్ట్

తప్పించుకు తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్‌: వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్  ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. హయత్ నగర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు సభ్యుల టీమ్ ను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో చెడ్డీగ్యాంగ్ ఆరు చోట్ల దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. వారిని పట్టుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని..మొత్తానికి దొరికారని చెప్పిన పోలీసులు.. చెడ్డీగ్యాంగ్ నుంచి మరిన్ని నగలను రికవరీ చేయాల్సి ఉందన్నారు.

చెడ్డీ గ్యాంగ్ వృత్తి ఇది

ఇంటికి తాళం వేసుంటే దొంగతనం, లేకుంటే కత్తులు తదితర మారణాయుధాలతో బెదిరించి చోరీ. కేవలం చెడ్డీలు వేసుకుని, ఒళ్లంతా నూనె రాసుకుని, నలుగురు నుంచి ఆరుగురు సభ్యుల ముఠాగా రాత్రిళ్లు, శివారు ప్రాంతాల్లోని కాలనీ వీధుల్లో తిరుగుతూ, కనిపించిన ఇంట్లోకి జొరబడి దొంగతనాలకు పాల్పడటమే.