అదంతా మనీ కోసమే!

అదంతా మనీ కోసమే!

చేసిన పని తప్పైనా ఒప్పైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయడం రాధికా ఆప్టేకి అలవాటు. నెపోటిజం, రెమ్యునరేషన్ ఇష్యూస్, లైంగిక వేధింపులు… టాపిక్ ఏదైనా నదురూ బెదురూ లేకుండా తాను అనుకున్నది చెప్పేస్తుంది రాధిక. రీసెంట్‌‌గా తాను చేసిన బోల్డ్ పాత్రల గురించి కూడా అంతే సూటిగా చెప్పింది. సౌత్‌‌లో రక్తచరిత్ర, లెజెండ్, లయన్, కబాలి వంటి చిత్రాల్లో చాలా డిగ్నిఫైడ్ రోల్స్ చేసింది రాధిక. కానీ నార్త్‌‌లో ఆమె చేసిన పాత్రలు మాత్రం పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అందాన్ని మితిమీరి చూపించే రోల్స్ చేయడమే సెన్సేషన్ అంటే.. న్యూడ్‌‌గా కూడా నటించి షాకిచ్చింది. అయితే అదంతా తప్పనిసరి పరిస్థితుల్లో మనీ కోసం చేశాను అంటోంది రాధిక.

‘ఇండస్ర్టీలో అడుగుపెట్టిన కొత్తలో మనీలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. సాయం చేసేందుకు ఎవరూ లేరు. అందుకే ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేసేదాన్ని. ఆ క్రమంలోనే కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేశాను. ‘పర్‌‌‌‌ఛేద్’ మూవీలో నగ్నంగా నటించింది కూడా అందుకే’ అంటూ ఏమాత్రం మొహమాటపడకుండా చెప్పింది. అంతేకాదు.. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్’లో  చాన్స్ వచ్చిందట. కానీ అప్పట్లో ఆమె బీర్ ఎక్కువగా తాగేదట. దానివల్ల బాగా బరువు పెరగడంతో ఆ చాన్స్ పోయిందట. ‘ఇప్పుడు మాత్రం చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. అందుకే ఇక అలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం లేదు’ అంటోంది రాధిక. ఏదేమైనా ఆమె ముక్కుసూటితనాన్ని, ముసుగు వేసి మాట్లాడని మంచి లక్షణాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.