రేజ్ ఆఫ్ భోళాతో.. మెగాస్టార్ బీభత్సం

రేజ్ ఆఫ్ భోళాతో.. మెగాస్టార్ బీభత్సం

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar). టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ ఎఆర్ రెహమాన్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు  

రేజ్ ఆఫ్ భోళా పేరుతో ఓ రాప్ అంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది భోళా మూవీ టీమ్. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ అంథమ్ ను , డైరెక్టర్ మెహర్ రమేష్, ఫెరోజ్ ఇస్రాయిల్ లిరిక్స్ అందించారు. ఒకటి..రెండు..మూడు.. వచ్చాడు అన్న చూడు..స్టేట్ అంతా వెతికి చూడు..ఎదురొచ్చేటోడే లేడు.. అంటూ ర్యాపర్స్ అసుర, ఫెరోజ్ ఇస్రాయిల్  పాడారు. 

ఈ అంథమ్ సాంగ్ లో చిరు పెర్ఫార్మన్స్ తో పాటు, లుక్స్, మేనరిజం అద్దిరిపోయాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో.. తమన్నా(Thamannah) హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) నటిస్తోంది. సుశాంత్(Sushanth)మరో కీలకపాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా.. తమిళ హిట్ సినిమా వేదాళం(Vedalam) సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. మహతి స్వర సాగర్(Mahati Swara Sagar) మ్యూజిక్  అందిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర(Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు.