కంటి సర్జరీ కోసం బ్రిటన్​కు రాఘవ్ చద్దా : సౌరభ్ భరద్వాజ్

కంటి సర్జరీ కోసం బ్రిటన్​కు రాఘవ్ చద్దా : సౌరభ్ భరద్వాజ్

న్యూఢిల్లీ: ఆప్ నేత, రాజ్య సభ సభ్యుడు రాఘవ్ చద్దా కంటి సర్జరీ కోసం బ్రిటన్ వెళ్లారని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అందువల్లే రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. ‘‘చద్దా తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నా రు. సకాలంలో చికిత్స తీసుకోక పోతే ఆయన చూపు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే శస్త్ర చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. 

కోలుకున్న వెంటనే తిరిగి వచ్చి ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా రు” అని మంత్రి పేర్కొన్నారు. ఆప్ కీలక నేత అయిన రాఘవ్ చద్దా విదేశాల్లో ఉండటంతో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ముందుండి నడిపిస్తున్నారు. అయితే, రాఘవ్ చద్దా మాత్రం పార్టీకి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.