Niharika NM Raghav Juyal: ప్యారడైజ్ విలన్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్.. రొమాంటిక్ పిక్స్‌తో క్రేజీ రచ్చ!

Niharika NM Raghav Juyal: ప్యారడైజ్ విలన్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్.. రొమాంటిక్ పిక్స్‌తో క్రేజీ రచ్చ!

బాలీవుడ్ యంగ్ యాక్టర్, డ్యాన్సర్ రాఘవ్ జయల్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, తెలుగు హీరోయిన్ నిహారిక NM డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని రొమాంటిక్ ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

అయితే ఇది నిజంగానే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించడానికా? లేక తమ రాబోయే సినిమా Bhai Tera Star Hai ప్రమోషన్‌లో భాగమా? అనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా నిహారిక తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ కనిపించడంతో ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)

వైరల్ అవుతున్న ఫొటోల్లో నిహారిక ఎరుపు రంగు స్వెట్‌షర్ట్‌లో కనిపించగా, రాఘవ్ బూడిద రంగు జాకెట్ ధరించాడు. ఒక ఫొటోలో రాఘవ్ వెనుక నుంచి నిహారికను హత్తుకుని ఉండగా, ఇద్దరూ కెమెరాకు చిరునవ్వులతో పోజులిచ్చారు. వీరి కెమిస్ట్రీ నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇక అభిమానులు కూడా తమ ఆనందాన్ని దాచుకోలేకపోయారు. ‘ఓ మై గాడ్.. ఇది నమ్మలేకపోతున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. రాఘవ్ జుయాల్‌ను రొమాంటిక్ పాత్రలో చూడాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను’ అని ఒకరు కామెంట్ చేయగా, మరో అభిమాని "మాషా అల్లాహ్! ఇది సినిమా ప్రమోషన్ కాకపోతే బాగుంటుంది. మీ ఇద్దరి జోడీ అద్భుతంగా ఉంది" అని రాశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)

రాఘవ్ జుయాల్‌, నిహారిక ఎన్ఎమ్ త్వరలోనే భాయ్ తేరా స్టార్ హై చిత్రంలో కలిసి కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్ అగర్వాల్  దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రాఘవ్ జుయాల్‌, షెహనాజ్ గిల్ తో ప్రేమలో ఉన్నారనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఆ రూమర్లపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పుడు నిహారిక ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. 

రాఘవ్ కెరీర్ విషయానికి వస్తే, రాఘవ్ మొదట డ్యాన్సర్‌గా పేరు సంపాదించి, ఆ తర్వాత యాక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. 'కిల్' మూవీలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే, ఆర్యన్ ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది బా ***స్ ఆఫ్ బాలీవుడ్'లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో ‘ది ప్యారడైజ్’లో నానికి విలన్గా కనిపించనున్నాడు. ‘విక్రమ్ మాలిక్’ అనే పవర్ఫుల్ మరియు క్రూరమైన ప్రతినాయకుడిగా చూపిస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది.  

మరోవైపు, నిహారిక NM ఇండియాలోని డిజిటల్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడతో సహా ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడటంలో నిహారిక ప్రత్యేకతను సంపాదించుకుంది. ఆమె కామెడీ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌తో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గతేడాది విడుదలైన తమిళ బ్లాక్ కామెడీ చిత్రం పేరుసు తో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చి, తెలుగులో ప్రియదర్శి సరసన 'మిత్ర మండలి' మూవీ చేసి ఆకట్టుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)

చెన్నైలో పుట్టి పెరిగిన ఈ సౌత్ బ్యూటీ, బ్యూటిఫుల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో సెన్సేషన్ సృష్టించింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య లక్ష నుంచి 10 లక్షలకు చేరింది. ఇకపోతే, రాఘవ్-నిహారిక ఫొటోలు నిజంగా డేటింగ్ ప్రకటనకా, లేక సినిమా ప్రమోషన్ కోసమా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)