రోడ్ ట్రిప్‌‌లో ఏం జరిగింది?

రోడ్ ట్రిప్‌‌లో ఏం జరిగింది?

రాఘవ్‌‌ తివారీ, స్వామి మెహ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆన్ ది రోడ్’. సూర్య లక్కోజు దర్శకత్వం వహిస్తూ రాజేశ శర్మతో కలిసి నిర్మిస్తున్నారు. ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్,  ట్రైలర్‌‌‌‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రమిది.

తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న జంటకు మూడో వ్యక్తి పరిచయంతో జరిగిన పరిణామాలపై దీన్ని రూపొందించాం’ అన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌‌సీసీ) వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టులో ఒక భాగం అయ్యారు.