డ్యాన్సర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రవేశం గురించి క్లూ ఇచ్చిన లారెన్స్.. లేటెస్టుగా శుక్రవారం (జూన్ 12) అభిమానులకు పంపిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజకీయాల్లోకి రావాలా వద్దా..? మీరు ఎలా అంటే అలా.. మీ నిర్ణయమే ఫైనల్ అంటూ ఎక్స్ లో లారెన్స్ వీడియో పోస్ట్ చేశారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ పని మీరు సక్రమంగా చేయండి అంటూ పెట్టిన ఆ వీడియో వైరల్ గా మారింది. రాజకీయాల్లో రావాలా వద్దా అనేది అభిమానుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఉంటుందని వీడియోలో పేర్కొన్నారు లారెన్స్.
సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి నుంచి పోటీ చేస్తాననే వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఇప్పటికే ఈ విషయంపై నన్ను సంప్రదించారు. దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు ఓకే అంటే ఎంట్రీ ఇస్తానని చెప్పారు లారెన్స్. తిరుచ్చి నుంచి పోటీ చేసేందుకు సిద్ధం.. టీవీకే తరుఫున బరిలోకి దిగుతానని పరోక్షంగా చెప్పకనే చెప్పారు లారెన్స్.
మీరు వద్దన్నారనుకోండి.. నేను పాలిటిక్స్ కు దూరంగా ఉంటా.. సమాజానికి సేవ కొనసాగిస్తా. ఒకవేళ మీరు ఓకే అంటే రాజకీయ రంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాట చెప్పారు లారెన్స్.
ప్రజల మద్ధతు ఆధారంగా.. ఎప్పుడు వస్తున్నానో, ఎవరితో వస్తున్నానో చెబుతానని లారెన్స్ అన్నారు. రాజకీయ ప్రవేశానికి మందు ప్రజాభిప్రాయాన్ని కోరిన కొద్ది మందిలో లారెన్స్ ఒకరు. పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభిమానులకు పంపిన రిక్వెస్ట్ కు భారీ స్పందన వస్తోంది. మీరు రాజకీయాల్లోకి రావాలని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు ఫ్యాన్స్ ఒప్పుకున్నట్లే. ఇక లారెన్స్ ఎంట్రీ ఎప్పుడు అనేదే తరువాయి.
Do your duty sincerely, without expecting anything in return.
— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy
