డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!

డ్యాన్సర్ అసోషియేషన్ లో గత కొంతకాలంగా ఏర్పడిన వివాదం మరో మలుపు తిరిగింది. 2026 ఆగస్టు 30వ తేదీన డ్యాన్సర్స్ అసోషియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  అసోషియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ను ఎన్నుకున్నారు. సెక్రటరీగా మెహర్ బాబా మాస్టర్, వైస్ ప్రెసిడెంట్ గా బసవరాజు, జాయింట్ సెక్రటరీగా రాజన్నను ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా సతీష్,  నాగార్జున, శివ కృష్ణ , జోజోలు ఎన్నికయ్యారు.

ప్రెసిడెంట్ రఘు మాస్టర్ కామెంట్స్:

  • నేను 97 నుంచి ఈ అసోసియేషన్ లో మెంబెర్ గా ఉన్నాను
  • దాసరి గారు లాంటి పెద్ద వాళ్ళు అందరూ కలసి ఒక్కక్కొ క్రాప్ట్ ని బిల్డ్ చేసి పరిశ్రమను అభివృద్ధి చేశారు 
  • ప్రతి అసోసియేషన్ లో అపోనెంట్స్ ఉంటారు 
  • ఫెడరేషన్ సహాయ సహకారాలు లేవు అన్నప్పుడు ప్రెసిడెంట్ నుంచి సమాధానం కోసం డాన్సర్స్  ఎదురు చూశారు 
  • ఇది మాస్టర్స్ ప్రాబ్లం కాదు డాన్సర్స్ ప్రాబ్లం 
  • 24 క్రాఫ్ట్స్ కి హెడ్ ఫెడరేషన్ 
  • డ్యాన్సర్స్ కి వేతనాలు గురించి మాట్లాడాలి అంటే ఫెడరేషన్ ద్వారానే నిర్మాతలను సంప్రదించాలి 
  • సెక్యూరిటీ ఉంటుందనే  అందరూ డాన్సర్స్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యారు 
  • ఫెడరేషన్ గుర్తించాలి అనేది మన తపన 
  • ఏ ఇండస్ట్రీలో కూడా ఫెడరేషన్ సహాయ నిరాకరణ లేదు 
  • ఫస్ట్ టైమ్ ఇక్కడ ఆ పరిస్థితి వచ్చింది 
  • మన అసోసియేషన్ కి అందరి అండ కావాలి 
  • మాస్టర్స్ అందరి సపోర్ట్ కూడా అసోసియేషన్ కి ఉంటుంది 
  • మనం అందరం ఫెడరేషన్ లో కి వెళ్లిన తరువాత మళ్లీ ఎలక్షన్స్ పెట్టుకుందాం
  • అప్పుడు కూడా సుమలత పోటీ చేయవచ్చు 
  • ఇక్కడ గొడవలు ఏమీ లేవు అందరికీ ఒక్కటే రూల్ 
  • మినిట్స్ బుక్ లో డాన్సర్స్ అందరూ సంతకాలు చేసి ఇస్తే.. అవి ఫెడరేషన్ కి ఇచ్చి వెంటనే ఎన్నికల కు వెళ్దాం
  • ఫెడరేషన్ అండతో అసోసియేషన్ ఎన్నికలు జరగాలి 
  • టెంపరరీ గా బాడీ ని ఏర్పాటు చేయండి