రాహుల్ గాంధీ అరెస్టు నిరంకుశ పాలనకు నిదర్శనం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాహుల్ గాంధీ అరెస్టు నిరంకుశ పాలనకు నిదర్శనం: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని ‘ఎక్స్’ వేదికగా వివేక్ ఖండించారు. దేశంలో నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం నేరం కాదని అన్నారు. విద్యార్థుల గొంతులను వినాల్సిన కేంద్ర ప్రభుత్వం.. వారిని అణిచివేస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టు వివేక్  పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, శాంతియుత నిరసన హక్కును పరిరక్షించడానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ‘ఎక్స్’లో వివేక్ స్పష్టం చేశారు.