ఓట్‌‌‌‌‌‌‌‌ చోరీ వెనుక మోడీ, షా.. ఎన్డీయే పాలనలో దేశమంతా ఆగం: రాహుల్ గాంధీ

ఓట్‌‌‌‌‌‌‌‌ చోరీ వెనుక మోడీ, షా.. ఎన్డీయే పాలనలో దేశమంతా ఆగం: రాహుల్ గాంధీ

మార్‌‌‌‌‌‌‌‌గావ్: గోవాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘గోయ్ రఖోన్ యాత్ర’ ముగింపు వేడుకల్లో లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరీకి పాల్పడ్డారనే విషయం యావత్‌‌‌‌‌‌‌‌ ప్రపంచానికి తెలుసునని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిని అమలు చేస్తుండగా, ప్రధాని మోదీ తెరవెనుక ఉండి ఈ ప్రణాళికను రచిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఓట్లను చోరీ చేసిన వాళ్లు త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ఎన్డీయే పాలనలో దేశం మొత్తం ఆగమైందని ఆవేదన వ్యక్తంచేశారు. గోవాలో నేతలు, కార్యకర్తలతో కలిసి రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం రాహుల్​మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీకి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ, హర్యానా. ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్​లో ఓట్​చోరీ జరిగిందన్నారు. 

తనపై మోదీ, అమిత్ షాలతో పాటు ఇతరుల మీద మొత్తం 45కి పైగా పరువు నష్టం కేసులు ఉన్నాయని, కానీ ‘ఓట్లు దొంగిలిస్తున్నారు’ అని తాను ప్రతి వేదికపై చెబుతున్నప్పటికీ తనపై ఎందుకు ఒక్క కేసు కూడా వేయలేదని ప్రశ్నించారు. ఓట్ల దొంగతనంపై ప్రత్యేకంగా కేసు పెడితే అది పూర్తిస్థాయి న్యాయపోరాటంగా మారి చిక్కుల్లో పడతామనే భయంతోనే వారు ఆ సాహసం చేయట్లేదని రాహుల్ ​ఆరోపించారు.

కరప్షన్‌‌‌‌‌‌‌‌కు గోవా మోడల్‌‌‌‌‌‌‌‌

దేశంలోనే గోవా అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని, అధికారంలో ఉన్నవారు దీనిని కరప్షన్ ఒక ‘మోడల్’గా మార్చేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే తాను ఇక్కడిని వచ్చానని తెలిపారు. అలాగే దేశంలో విద్యా వ్యవస్థ క్షీణించిందని విమర్శించారు.డబ్బు, అధికారం లేకుంటే.. లేదా.. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ రాకపోతే ఈ వ్యవస్థ ఏ మాత్రం ఆలోచించకుండా మిమ్మల్ని బయటకు నెట్టేస్తుందన్నారు. 
నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్‌‌‌‌‌‌‌‌ గన్స్‌‌‌‌‌‌‌‌ ప్రయోగించే దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు.