
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj) గొప్ప మనసును చాటుకున్నారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తూ సంగీతం నేర్చుకుంటున్న వెంకటేష్ అనే వ్యక్తికి లక్ష రూపాయలు సాయంగా అందించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న సింగింగ్ ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా వచ్చారు వెంకటేష్. ఈ షోకి అనంత్ శ్రీరామ్, శ్వేతా మోహన్, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ షో పాల్గొన్న వెంకటేష్.. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మూవీలోని చూడు మామ దుమ్ము చూడు మామ.. అనే పాట పాడి జడ్జీలను మెప్పించాడు. అనంతరం వెంకటేష్ జర్నీని ప్లే చేయగా.. ఆ వీడియోలో అతను ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ సంగీతం నేర్చుకుంటున్నట్టుగా చూపించారు. ఆ వీడియోకి ఎమోషనల్ ఐన రాహుల్.. నేను కూడా బార్బర్ గా పనిచేసి ఇక్కడిదాకా వచ్చాను. నిన్ను చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెల్సు. అందుకే వెంకటేష్ సంగీతం నేర్చుకోవడానికి లక్ష రూపాయలు సాయంగా ఇస్తున్నాను. అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన రాహుల్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.