రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు.. విశాఖ బాధితురాలి ఫుల్ క్లారిటీ!

రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు.. విశాఖ  బాధితురాలి ఫుల్ క్లారిటీ!

విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారంటూ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై కేసు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 15 మందిపై ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  రాహుల్ సిప్లిగంజ్ తనను బెదించాడంటూ ఆరోపణులు చేసింది.వైరల్ అవుతున్న ఈ వివాదంపై  బాధితురాలు కీలక వ్యాఖ్యలు చేస్తూ క్లారిటీ ఇచ్చింది.

లేటెస్ట్ గా ఈ వ్యవహారంపై బాధితురాలు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఇది  రాహుల్ రెడ్డి, తనకు మధ్య జరుగుతున్న మేటర్ .   రాహుల్‌ సిప్లిగంజ్‌కి ఈ వివాదంతో ఎలాంటి  సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇది వ్యక్తి గత సమస్య.  మేమిద్దరం లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నాం. పోలీసులకు కూడా చెప్పాం అని తెలిపారు.  ప్రస్తుతం ఆమె ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే కేసులో మూడో వ్యక్తుల ప్రమేయం, బెదిరింపుల వల్ల రాహుల్ సిప్లిగంజ్ పేరు తెరపైకి వచ్చిందని పేర్కొంది. ఈ పర్సనల్ ఇష్యూ ఇంత పెద్ద సమస్యగా మారడానికి కొంతమంది వ్యక్తులు అని బాధితురాలు అన్నారు. రాహుల్ రెడ్డి బంధువుగా ఇక్కడ ఒక సెలబ్రిటీ పేరు ఎప్పుడైతే చూశారో, వాళ్ళు నన్ను బెదిరించి, హెరాస్‌మెంట్ చేసి, బ్లాక్‌మెయిల్ చేశారు  నాకు ప్రాణభయం తలెత్తేలా చేసి నా చేత వీడియోలు చేయించుకున్నారని వెల్లడించింది.  

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా బయటకి వస్తున్న వీడియోలు వాళ్లే బలవంతంగా నా చేత చేయించారు . నన్ను హనీ ట్రాప్ కేసులో ఇరికిస్తామని, నీకు వ్కతిరేకంగా ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టిస్తామని బెదిరించారు. ఫేక్ కంప్లైంట్లు సృష్టించి నా మీద ప్రెజర్ తెచ్చారని వాపోయింది. రాహుల్ రెడ్డికి తనకు మధ్య ఉన్న వివాదంతో రాహుల్ సిప్లిగంజ్ కు సంబంధం లేదని తేల్చిచెప్పారు.

గవర్నమెంట్‌ని, పోలీసులని అడ్డుపెట్టుకుని కొంత మంది నా కెరీర్‌ను, జీవితాన్ని నాశనం చేయడానికి చాలా పెద్ద కుట్రలు చేశారు. మా ఇద్దరి మధ్య జరగని విషయాలను క్రియేట్ చేశారు .వీడియోలు, ఆడియోలు మార్పులు చేసి బయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను బ్యాడ్ చేసే విధంగా చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.

విక్టిమ్ గా నేను చేయని వాటికి నాపై రుద్దుతున్నారు.   రాహుల్ రెడ్డి , తమ మధ్య వివాదంపై కాంప్రమైజ్ అయ్యాము. తాము కోర్టులో వేసిన కేసును కూడా రిటర్న్ తీసుకున్నామని తెలిపారు. బాధితురాలు క్లారిటీతో.. రాహుల్ సిప్లిగంజ్ కు ఈ వివాదంతో ఎలాంటి ప్రమేయం తేదని స్పష్టమైంది.