సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా కోట బొమ్మాళి : రాహుల్ విజయ్

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా  కోట బొమ్మాళి : రాహుల్ విజయ్

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌‌ రోల్స్‌‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌‌’.  గీతా ఆర్ట్స్ 2  బ్యానర్‌‌‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘శ్రీకాకుళం జిల్లా  కోట బొమ్మాళి అనే ఊరి పోలీస్ స్టేషన్‌‌లో  ఏం జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్. కానిస్టేబుల్ రవి పాత్రలో నటించా. దర్శకుడు  తేజ మార్ని  ప్రతి ఒక్కరి నుంచి  బెస్ట్ రాబట్టుకున్నారు. 

దేశంలో ఉన్న  రాజకీయ పరిస్థితులను ఇందులో చూపించారు.  స్క్రీన్ ప్లే రేసీగా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా ఉంటుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్‌‌గా కూడా ఉంటుంది. ‘నయట్టు’ చిత్రానికి రీమేక్ అయినా..  తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు.  లింగిడి లింగిడి పాట వల్ల సినిమాకు మరింత బజ్ వచ్చింది. 

ఒకప్పుడు నాన్నగారు అసిస్టెంట్ ఫైటర్‌‌‌‌గా, ఫైట్ మాస్టర్‌‌‌‌గా వర్క్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థలో ఇప్పుడు నేను హీరోగా చేయడం గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్. ఈ సినిమా నా కెరియర్‌‌‌‌కు  ప్లస్ అవుతుందనుకుంటున్నా. లీడ్ గానే కాకుండా మంచి పాత్ర దొరికితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం ఆర్కా సంస్థలో ఒక రియాల్టీ షో చేస్తున్నా’ అని చెప్పాడు