హనీమూన్ ఆన్ వీల్స్.. రైలులోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో హనీమూన్ ఫస్ట్ నైట్ తరహాలో డెకరేషన్ చేయటంపై రైల్వే శాఖ చాలా సీరియస్ అయ్యింది. మొదట్లో దీన్ని పాజిటివ్ గా తీసుకున్నా.. ఆ తర్వాత వస్తున్న విమర్శలు, ఆరోపణలు, భద్రతా వైఫల్యంపై రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఓ రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ లో హనీమూన్ తరహాలో డెకరేషన్ చేస్తుంటే.. రైల్వే అధికారులు, టీసీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యం కింద భావిస్తుంది. డెకరేషన్ చేయటానికి సమయం పడుతుంది.. అంత జరుగుతుంటే ఎవరూ చూడకపోవటం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే రైలు నెంబర్ 11002 నందిగ్రామ్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆ రోజు టికెట్ కలెక్టర్.. టీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగిని సస్పెండ్ చేసింది. అదే విధంగా జల్నా రైల్వేస్టేషన్ లో.. అనధికారికంగా బోగీలోకి వచ్చిన క్యాబిన్ ను డెకరేట్ చేసిన డెకరేషన్ యాజమాన్యం, సిబ్బందిపై కేసులు పెట్టింది. జల్నా రైల్వేస్టేషన్ లో బాధ్యులు అయిన సిబ్బందిని చర్యలు తీసుకున్నది.
హనీమూన్ ఆన్ వీల్స్ అని.. రైలు ఏసీ బోగీలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ను నిబంధనలకు విరుద్ధంగా డెకరేట్ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఇది రైల్వే శాఖ భద్రతా లోపంగా భావిస్తు విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ.
ALSO READ : రైలులో హనీమూన్ ఫస్ట్ నైట్ : జోక్ కాదు.. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో నిజంగా..!
ఇలాగే వదిలేస్తే రైళ్లు హనీమూన్ ఫస్ట్ నైట్ డెస్టినేషన్ అవుతాయని.. కోట్ల మంది ప్రయాణికుల భద్రతకు ముప్పుగా భావించిన రైల్వే శాఖ.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. నివేదిక తర్వాత బాధ్యులు అయిన అందరిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది రైల్వే శాఖ.
A couple travelling in Train No. 11002 Nandigram Express on 6th July, 2026 had privately engaged a decorator online to decorate their 1st AC coupe.
— South Central Railway (@SCRailwayIndia) July 8, 2026
The decorator's entry into the coach at Jalna station was unauthorized and is viewed as a serious lapse. The concerned staff…
