హైదారాబాద్ కు రెయిన్ అలర్ట్ : హైదరాబాద్ వాతావరణశాఖ

హైదారాబాద్ కు  రెయిన్ అలర్ట్ :  హైదరాబాద్ వాతావరణశాఖ
  • ఇయ్యాల భారీ వర్షం పడే చాన్స్
  • హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.  తుఫాన్​ కారణంగా సోమవారం సిటీ వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చలిగాలులు వీచాయి. మధ్యాహ్నం సమయంలో కూడా జనం స్వెటర్లు, జాకెట్లు, హుడీలతో కనిపించారు. అత్యధిక ఉష్ణోగ్రత 27 డిగ్రీలు నమోదు కాగా.. అత్యల్పంగా 19 డిగ్రీలుగా నమోదైంది.