Health alert: వర్షాలు పడతాయట.. డెంగీ దోమలు రెచ్చిపోతాయి.. ఆరోగ్యం జాగ్రత్త.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

Health alert: వర్షాలు పడతాయట.. డెంగీ దోమలు రెచ్చిపోతాయి.. ఆరోగ్యం జాగ్రత్త.. తీసుకోవలసిన  జాగ్రత్తలు ఇవే..!

వాతారణశాఖ చల్లని కబురు తెచ్చింది. తుపాన్​ హెచ్చరికలు జారీ చేసింది.  భారీ వర్షాలు పడతాయని .. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అలెర్ట్​ చేస్తుంది.  రెండు చినుకులు పడ్డాయంటే చాలు దోమలు రెచ్చిపోతాయి.  ఇక డెంగీ దోమలు దాడి చేశాయంటే చాలు.. ఆరోగ్యం కుదేలవుతుంది. జ్వరం.. తలనొప్పి.. వాంతులు.. బాడీ పెయిన్స్​ అబ్బో ఒకటేమిటి ఇంకా ఎన్నోరకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  అందుకే డెంగీ, మలేరియా.. టైఫాయిడ్​ లాంటి మహమ్మారి విష జ్వరాల నుంచి కాపాడుకొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

వర్షం పడితే చాలు.. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రస్తుతం వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసింది.  వర్షాలకి మురికి నీళ్లు, దోమలూ విపరీతంగా పెరిగే చాన్స్ ఉంది. ఈ టైంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం డెంగీ వ్యాపించే అవకాశం ఉంది. అఫెబ్రిల్ డెంగీ కేసులు అక్కడడక్కడ కనిపించటంతో  మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట కూడా

ఈడిస్ ఈజిఫై కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది.. నల్లగా ఉండి పైన తెలుపు రంగు చుక్కలతో ఉండే ఈ దోమని టైగర్ దోమ అంటారు. డెంగీ వైరస్ ని మోసుకొచ్చేది ఇదే... ఈ దోమ పగటి పూటే కుడుతుంది. అయితే నగరాల్లో లైటింగ్ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా దాడి చేస్తోంది. 

దీనికి మనిషి రక్తమే ఆహారం కావడంతో వారినే టార్గెట్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ రోగిని కుట్టిన దోమ ఇంకొకరిని కుట్టినా వాళ్లకీ డెంగీ సోకుతుంది.. డెంగీ సోకితే తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది. 


ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు వైట్​ప్లేట్ లెట్స్ ఉంటాయి. డెంగీ బాధితుల్లో ఈ సంఖ్య 40 వేల కిందకు పడిపోతుంది. అది 20 వేలకంటే తగ్గితే మరీ ప్రమాదం..

'అఫెబ్రిల్ డెంగీ'

జ్వరం, ఒళ్లునొప్పులు, శరీరం మీద రాషెస్ లాంటి లక్షణాలు కనిపించకుండా కూడా డెంగీ వస్తుంది. మామూలుగా అయితే డెంగీ కేసుల్లో పేషెంట్లకు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లంతా నొప్పులు కూడా ఉంటాయి. కానీ డయాబెటిస్ ఉన్న పేషెంట్లకు, వయసు పైబడ్డవాళ్లకు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేకపోయిన డెంగీ రావచ్చు.

 వీళ్లకు జ్వరం రాకున్నా డెంగీలోని ఇతర లక్షణాలన్నీ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు. అందువల్ల వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు. ఈ రకం డెంగీలో చాలా తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. పరీక్ష చేస్తే ప్లేట్ లెస్​ కౌంట్
పడిపోయి కనిపిస్తుంది.

ఎక్కువగా కనిపించే డెంగీ లక్షణాలు

జ్వరం 103, 104 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒంటి నొప్పులు, కంటి గుడ్డు వెనుక భాగం లాగినట్లు నొప్పి, బోన్ ఫీవర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గిపోయి జ్వరం లేకపోయినా అది డెంగీ కావచ్చు. 

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించుకోవడం మంచిది. నీళ్లు ఎక్కువగా తాగడం డెంగీకు మంచి ట్రీట్​ మెంట్ అని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ తీవ్రంగా ఉన్నా, తక్కువగా ఉన్నా, నీళ్లు ఎక్కువగా తాగాలి. సరైన విశ్రాంతి తీసుకుంటే పేషెంట్ త్వరగా కోలుకుంటారు.

జాగ్రత్తలివే...

కాళ్లూ, చేతులతో సహా బాడీ పూర్తిగా కవర్ అయ్యే బట్టలు వేసుకోవాలి. దోమలు ఉంటే పగలు కూడా మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి. అయితే ఈ రిపెల్లెంట్స్ వల్ల కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. రిపెల్లెంట్స్ కన్నాజెల్స్ వాడటం మంచిది. కిచెన్​ లో పడేసే అన్నం, కూరలు, చెత్తను ఓపెన్​ గా పెట్టొద్దు. ఫ్లవర్ వేజ్, ఎయిర్ కూలర్లలో నీళ్ళను రెగ్యులర్ గా మార్చాలి. విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, పాత ట్యూబ్, టైర్లు ఇళ్లలో ఉంచొద్దు.

ఇంటి చుట్టు పక్కల, ఇంటిలో ఎక్కడా నీళ్లు నిలువ ఉంచవద్దు. నీళ్లు మార్చే అవసరం పడని అక్వేరియం ఫిష్ పాట్స్ మీద మూత పెట్టాలి. జ్వరం, ఎముకల్లో నొప్పులు, కళ్లలో నుంచి నీరు కారడం, కళ్లు కదిలించడం కష్టంగా మారడం, ఆకలి తగ్గి, వాంతి అవుతున్నట్టు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉంటుంది.

 కొన్ని సార్లు కడుపునొప్పి కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు జ్వరం వచ్చినా ఏదో ఒక మాత్ర వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే డెంగీ డయాగ్నైజ్ అవ్వటం చాలా కష్టం.  సివియర్ కేసుల్లో బీపీ తగ్గిపోవటం, బ్లడ్ వాంటింగ్స్, బ్లడ్ మోషన్స్ కూడా అవుతాయి. అంతవరకూ తెచ్చుకోకపోవటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.