బెంగళూరు: భారీ వర్షం వల్ల ఇండియా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్‌ను రద్దు అయ్యింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2–2తో ముగిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. చివరకు కాస్త తెరపి ఇవ్వడంతో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 7.4 ఓవర్లలో 118/5 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (10 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దంచికొట్టాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు అభిషేక్ శర్మ (6) ఔట్ కాగా, రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ 6, 4, 6, 4తో 24 రన్స్ దంచాడు. మూడో ఓవర్లో మరో ఫోర్ కొట్టి.. మూడో బాల్‌కు వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 32 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది.
రెండో ఎండ్‌లో 4, 6, 4తో బ్యాట్ ఝుళిపించిన సంజూ శాంసన్ (16) ఐదో ఓవర్లో ఔటయ్యాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 21 రన్స్ జతయ్యాయి. వచ్చిన వెంటనే రెండు ఫోర్లు బాదిన శ్రేయస్ అయ్యర్ (22) ఏడో ఓవర్లో వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో నమన్ ధీర్ (6 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 24 నాటౌట్) 6, 4, 6తో రెచ్చిపోయాడు. ఆ వెంటనే మరో సిక్స్ బాదాడు. కానీ 8వ ఓవర్లో తిలక్ వర్మ (7) వికెట్ పడటం, వర్షం మళ్లీ రావడంతో ఇండియా ఇన్నింగ్స్ ఆగిపోయింది. వాన ఆగే పరిస్థితి లేకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
