రాజా ది రాజా మూవీ ఆరంభం  

రాజా ది రాజా మూవీ ఆరంభం  

రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజా ది రాజా’. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లాప్ కొట్టగా, రవి బాబు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘నేచర్‌‌‌‌‌‌‌‌తో రిలేట్ అయిన కథ ఇది. లవ్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిస్తున్నాం.  మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి జూన్‌‌‌‌లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.