Varanasi: కుంభకు వారణాసి టీమ్ బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫోటోలు రిలీజ్

Varanasi: కుంభకు వారణాసి టీమ్ బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫోటోలు రిలీజ్

విలక్షణ పాత్రలతో హీరోగా మెప్పిస్తున్న మలయాళ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పృథ్విరాజ్‌‌‌‌‌‌‌‌ సుకుమారన్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం పృథ్విరాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ పై ఫోటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

‘వారణాసి’ ప్రపంచంలో మోస్ట్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న వ్యక్తి కుంభ అంటూ తనకు బర్త్ డే విషెస్ తెలియజేసింది. ‘ప్రపంచంపై తనదైన ముద్ర వేయాలని విధి నిర్ణయించుకున్న వ్యక్తి కుంభ. నీలోని కుంభను ఈరోజు నిద్రలేపాలని అనుకోవడం లేదు’ అంటూ పృథ్విరాజ్‌‌‌‌‌‌‌‌కు రాజమౌళి విషెస్ చెప్పారు. ఆ వెంటనే “ధన్యవాదాలు సర్! మీ మేకింగ్ పిచ్చి, అద్భుతమైన ఆలోచనలను ప్రపంచమంతా చూసే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను! ” అంటూ పృథ్వీరాజ్ రిప్లై ఇవ్వడంతో పోస్ట్ వైరల్ గా మారింది.

మరోవైపు హీరో మహేష్ బాబు కూడా తనకు స్పెషల్ బర్త్ డే విషెస్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు. దీంతో సినిమాలో పృథ్వీరాజ్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్రపై ఆసక్తి పెరిగింది. మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.