రాజ‌శేఖ‌ర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు: జీవిత

రాజ‌శేఖ‌ర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు: జీవిత

సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత స్పందించారు. రాజశేఖర్ కు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని… 80 శాతం ఇన్ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాజశేఖర్ ఆరోగ్యం గురించి తాము ప్రతిరోజు డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు తెలిపారు జీవిత.

కొద్ది రోజుల కిందట రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడింది. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆస్పత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న జీవిత హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు.