ఆల్‌టైమ్ IPL XIలో రోహిత్‌కే దక్కని చోటు.. ధోనీ, కోహ్లీకి రెడ్ కార్పెట్ వేసిన ఆర్సీబీ కెప్టెన్

ఆల్‌టైమ్ IPL XIలో రోహిత్‌కే దక్కని చోటు.. ధోనీ, కోహ్లీకి రెడ్ కార్పెట్ వేసిన ఆర్సీబీ కెప్టెన్

Rohit Sharma Out Of IPL Dream XI: రెండుసార్లు ఆర్సీబీ (RCB)ని బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ XI (All-Time IPL XI) టీమ్‌ను ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును అసలు తన జట్టులోనే చేర్చకపోవడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్లుగా ఆర్సీబీ లెజెండ్స్ క్రిస్ గేల్ (4,489 పరుగులు), విరాట్ కోహ్లీ (5,684 పరుగులు, 9 సెంచరీలు)లను పాటిదార్ ఎంచుకున్నాడు.

మిడిల్ ఆర్డర్‌లో హిట్టర్లు.. వికెట్ కీపర్‌గా ధోనీ: 

నెంబర్ 3వ స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చిన రజత్ పాటిదార్, నెంబర్ 4, 5లలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్‌లను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆల్ రౌండర్ స్లాట్‌లో హార్దిక్ పాండ్యా (నెంబర్ 6) ఉండగా, ఫినిషర్ అండ్ వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ (నెంబర్ 7)కి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక పేస్ గన్స్ డెల్ స్టెయిన్, జస్ప్రీత్ బుమ్రాలను ఫ్రంట్‌లైన్ పేసర్లుగా ఎంపిక చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, స్పిన్ బాధ్యతలను వికెట్ టేకింగ్ స్పెషలిస్ట్ యుజ్వేంద్ర చాహల్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లకు అప్పగించాడు.

నెక్స్ట్ దులీప్ ట్రోఫీలో రచ్చ:

2025, 2026 సీజన్లలో వరుసగా ఆర్సీబీని విన్నర్‌గా నిలిపి, ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాక్ టు బ్యాక్ రెండు టైటిళ్లు నెగ్గిన 3వ కెప్టెన్‌గా (ధోనీ, రోహిత్ తర్వాత) రజత్ పాటిదార్ చరిత్ర సృష్టించాడు. ఈ సక్సెస్ జోష్‌లోనే ఆగస్టు 30వ తేదీ నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ 2026లో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ బరిలోకి దిగబోతున్నాడు. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ వ్యవహరించనుండగా, గతేడాది దులీప్ ట్రోఫీలో టాప్ రన్ స్కోరర్‌గా (382 పరుగులు) నిలిచిన పాటీదార్, ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగించి భారత జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. 

ALSO READ : ఆసియా కప్ గెలవాలంటే మెన్స్ టీమ్ సాయం కావాల్సిందేనా?

రజత్ పాటిదార్ ఆల్‌టైమ్ IPL XI:

క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), డెల్ స్టెయిన్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, సునీల్ నరైన్