జైలర్ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడా?

జైలర్ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న  లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైలర్ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం. 

ఓవర్సీస్‌లో 'జైలర్' షోలు ఇప్పటికే మొదలైపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఈ టాక్ ను బట్టి చూస్తే.. ఫస్టాఫ్ బాగుందని, సెకండ్ ఆఫ్ మాత్రం అస్సలు బాగోలేదనే రివ్యూలు వినిపిస్తున్నాయి. మరికొందరెమో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. మూవీ బాగుందని, రజని ఫ్యాన్స్ కు పండగేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు అనిరుద్ అందించిన బీజీఎం నెక్స్ట్ లెవల్లో ఉందట. ఇంటర్వెల్‌ ముందు వచ్చే సీన్స్ భలే థ్రిల్లింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. నెల్సన్ కుమార్ గత చిత్రాలలాగే డార్క్ కామెడీని ఇష్టపడేవారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే రజనీకాంత్ జైలర్ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ టాక్ తో రజని ఏ రేంజ్ హిట్ సాదిస్తాడో చూడాలి.