ఆ ఒక్క పాత్రలో నటించాలనుంది : రజినీ

ఆ ఒక్క పాత్రలో నటించాలనుంది : రజినీ

వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తూ.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ సంచలన కామెంట్ తో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటివరకు దాదాపు అన్ని క్యారెక్టర్లతో ఆకట్టుకున్న రజినీ.. ఆ ఒక్క పాత్రలో నటించి తన కోరికను తీర్చుకోవాలనుందని తెలిపాడు. ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ లో నటించాలనుంది అని చెప్పి మరోసారి తన మంచి తనాన్ని చాటాడు. ఇంత సాహసం చేయడానికి మామూలుగా ఏ హీరో ముందుకు రారని ..అలాంటిది స్టార్ హోదా పక్కనబెట్టి ట్రాన్స్ జెండర్ పాత్రలో నటిస్తానని రజినీ చెప్పడం గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.

రజినీ లేటెస్ట్ మూవీ ‘దర్బార్‌’ ట్రైలర్‌ ను ముంబైలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనను మీరు ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో నటించాను. సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు గడిచిపోయాయి. నాకు ట్రాన్స్‌జెండర్‌ పాత్ర చేయాలని ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో రజినీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన దర్బార్ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.