రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి మూవీ మార్చి 9న విడుదల

రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి మూవీ మార్చి 9న విడుదల

రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా సత్యరాజ్ దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. మార్చి 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో రవితేజ, దర్శకుడు సత్యరాజ్ మాట్లాడుతూ ‘ప్రేమ కథతో కూడిన  క్రైమ్ థ్రిల్లర్ ఇది. గోదావరి గ్రామీణ నేపథ్యం అనగానే ప్రేమ కథ, ప్రకృతి అందాలు చూపించడం కామన్. మా సినిమాలో వాటితో పాటు క్యూట్ లవ్ స్టోరీ, క్రైమ్ ఉంటాయి.  

ఓ రొమాంటిక్ సాంగ్ తర్వాత హీరోయిన్ చనిపోతుంది. ఆమెను ఎవరు హత్య చేశారనే పాయింట్‌‌తో ఆసక్తికరంగా కథ నడుస్తుంది. కేరళలో జరిగిన ఓ రియల్‌‌ ఇన్సిడెంట్‌‌ ఆధారంగా నేటివిటీ మార్చి తీశాం. రెండు కుటుంబాల మధ్య జరిగే ఇంటెన్స్ స్టోరీ ఇది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అలాగని ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదు. సంగీత దర్శకుడు రోషన్ పెద్ద సినిమాల స్థాయి మ్యూజిక్ ఇచ్చాడు. మొదట పరిమిత బడ్జెట్‌‌లో మొదలైనప్పటికీ ముత్యాల రామదాసు గారు వచ్చాక పెద్ద సినిమాగా మారింది. మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.