ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా రాకాస సినిమా: సంగీత్ శోభన్

ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా రాకాస సినిమా: సంగీత్ శోభన్

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాకాస’.  నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా  ఏప్రిల్‌‌ 3న విడుదల కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘మేం ఓ మంచి సినిమా తీశామని నమ్ముతున్నాం. 

ఆడియెన్స్ పెట్టే  ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా మా చిత్రం ఉంటుంది.  తప్పకుండా నిరాశపర్చదు’ అని అన్నాడు.  ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని హీరోయిన్ నయన్ సారిక చెప్పింది. సపోర్ట్ చేసిన అందరికీ డైరెక్టర్ మానస శర్మ థ్యాంక్స్ చెప్పింది. నిహారిక మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది.  

ఈ చిత్ర విజయంలో సంగీత్‌‌కే సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం’ అని అన్నారు. దర్శకుడు యదువంశీ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, నటుడు  గెటప్ శ్రీను,  మైత్రి శశి  సహా టీమ్ అంతా పాల్గొన్నారు.