నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్.. రాక్షస రాజా వస్తున్నాడు!

నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్.. రాక్షస రాజా వస్తున్నాడు!

నేనే రాజు నేనే మంత్రి(Nene Raju Nene Mantri).. టాలీవుడ్ స్టార్ హీరో రానా(Rana), దర్శకుడు తేజ(Teja) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. చాలా కాలంగా హిట్ కోసం చేస్తున్న దర్శకుడు తేజ ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో.. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

తాజాగా ఈ సీక్వెల్ పై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. డిసెంబర్ 14 రానా పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు రాక్షస రాజా అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రానా లుక్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు. చేతిలో మిషన్ గాన్ పెట్టుకొని, నుదుటన నామాలతో, నోల్తో చుట్టతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు రానా. ఈ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక త్వరలోనే సెట్స్ పైకి వేళ్ళనున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. పక్కా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.