రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు ఇతడే

రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు ఇతడే


Rakul Preet Singh, Jackky Bhagnani, rakul and jackky Wedding rumours, Rakul Preet Singh Akhand Path, Rakul Preet Singh Goa wedding, rakul and goa in Reception

టాలీవుడ్‌తో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంలో  రూమర్స్ కు చెక్ పడింది. రకుల్ గతకొద్ది కాలంగా ఈ అమ్మడు బాలీవుడ్  సినిమాలకే పరిమితమైంది. తెలుగు ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ ల ఎదురైన.. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు బాగానే చేస్తోంది. రెండేళ్ల క్రితమే బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు రకుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు గోవాలో వీరి పెళ్లి వేడుకలు రెండు రోజులు జరగనున్నాయి.  ముంభైలో రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ కు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు హజరుకావచ్చు. సిక్కు మత సంప్రదాయంలో ఓ వేడుకైన అఖండ పథ్ ఫిబ్రవరి 3న జరిగింది. ఆ ఫొటోను రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక హిందీ సినిమాతో పాటు ఒక తమిళ చిత్రం కూడా ఉంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో ఈ భామ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.