Rakul Preet Singh: రకుల్ పెళ్లి డ్రెస్ స్పెషాలిటీ..25 మంది సిబ్బంది 3 నెలల శ్రమ

Rakul Preet Singh: రకుల్ పెళ్లి డ్రెస్ స్పెషాలిటీ..25 మంది సిబ్బంది 3 నెలల శ్రమ

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ (Jocky Bhgnani)  (ఫిబ్రవరి 21న) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న వీరు ఇప్పుడు దంపతులు అయ్యారు. రకుల్ - జాకీ వివాహం గోవాలో గ్రాండ్‍గా జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో వీరి వివాహ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. అయితే, ఈ వివాహ వేడుకలో రకుల్ ప్రీత్- వేసుకున్న డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. రకుల్ పెళ్లి వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ఎంతో కళాత్మకంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. 

రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన డ్రెస్ తరుణ్ తహిలియాని లెహంగాలో స్పెషల్గా డిజైన్ చేశారు.లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో తరుణ్ లెహంగా డిజైన్ వాళ్ళు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. రకుల్ తన పెళ్ళిలో ధరించిన డ్రెస్ను చాలా మంది కళాకారుల సమిష్టి కృషితో..ఆకర్షణీయమైన దంతాలు మరియు బ్లష్ రంగులలో త్రిమితీయ పూల ఆకారంలోకి తీసుకురావడానికి  శ్రమించినట్లు డిజైనర్ తరుణ్ తహిలియాని తెలిపారు.

అలాగే, తరుణ్ లెహంగా డిజైన్ను పూర్తిగా కళాకారుల చేతితోనే చేసినట్లు..ఇందుకోసం రెండు వేల గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు. రకుల్ పెళ్ళిలో అందరినీ ఆకర్షించిన ఈ డ్రెస్ వెనుకాల ఎంత కష్టం ఉందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.అందుకే రకుల్ వేసుకున్న డ్రెస్ ఎంతో సహజ సిద్ధంగా కనిపిస్తూనే..ఆకర్షణకు ప్రాణం పోసింది.

ఈ వివాహ వేడుకలో రకుల్ తన జుట్టును బన్‌లో కట్టి, భారీ పోల్కీ మెరిసే ఆభరణాలతో తన రూపాన్ని మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా రకుల్ వేసుకున్న మేకప్ కోసం మంచుతో కూడిన బేస్ మరియు లేత గులాబీ రంగును ఎంచుకుంది.

లేటెస్ట్గా రకుల్ తన పెళ్లి వీడియోను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మెహందీ, హల్దీ, మ్యారేజ్ వేడుకకు సంబంధించిన వీడియో నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ కలర్ ఫుల్ వేడుకలో..స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ పెర్ఫార్మన్స్తో రకుల్ పెళ్లి వీడియో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

వీరి వివాహ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు.