
సౌత్ సినిమాల విషయంలో రకుల్ గ్యాప్ తీసుకుందా లేక గ్యాప్ వచ్చిందా అనే మాటెలా ఉన్నా.. సోషల్ మీడియా విషయంలో మాత్రం ఆమె అభిమానులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో ఒకటి, రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. లీడ్ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘రామాయణ్’లో కీలకపాత్రకు ఎంపికైంది రకుల్. రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె రావణుడి చెల్లెలు శూర్పనఖగా కనిపించబోతోంది.
సినిమాకు ఎంతో కీలకమైన ఈ పాత్ర కోసం మొదట ప్రియాంక చోప్రాను సంప్రదించారట మేకర్స్. కానీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంకకు డేట్స్ అడ్జస్ట్ చేయడం వీలుకాక ఒప్పుకోలేకపోయిందట. దీంతో ఈ పాత్ర కోసం పలువురినీ పరిశీలించిన మేకర్స్.. రకుల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఎంపిక చేసినట్టు సమాచారం.
కన్నడ స్టార్ యశ్ ఇందులో రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి రానుంది.