రామాయణంలో రకుల్.. ఆ పాత్రకి పర్ఫెక్ట్ అంటున్న నెటిజన్స్

రామాయణంలో రకుల్.. ఆ పాత్రకి పర్ఫెక్ట్ అంటున్న నెటిజన్స్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ(Netheesh Thiwari) రామాయనాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో.. సౌత్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) సీతగా కనిపించనున్నారు. ఇక కన్నడ స్టార్ యష్(Yash) రావణుడిగా, హనుమాన్ గా సన్నీ డియోల్(Sunny Deol), కైకేయి పాత్రలో లారా దత్తా(Lara Datta) కనిపించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని భాషలనుండి స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నాడు దర్శకుడు నితీష్ తివారి.

మొత్తం మూడు మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. రామాయణంలో అత్యంత కీలకమైన పాత్రలో శూర్పణఖ పాత్ర ఒకటి. ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఓకే చేశారట మేకర్స్. ఇప్పటికే టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ శూర్పణఖ పాత్రకు రకుల్ పర్ఫెక్ట్ ఛాయస్ అని, AI టెక్నాలజీతో ఆమెను శూర్పణఖ పాత్రలో క్రియేట్ చేస్తున్నారు. మరి భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.