ఒక్క ఛాన్స్​​ కోసం క్యూలో నిలబడ్డా: రకుల్​ప్రీత్​ సింగ్

ఒక్క ఛాన్స్​​ కోసం క్యూలో నిలబడ్డా: రకుల్​ప్రీత్​ సింగ్

వెండితెరపై మెరవాలని చిన్ననాటి నుంచే కలలు కన్న రకుల్​ప్రీత్​ సింగ్​ అందుకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్టు తెలిపింది. హీరోయిన్​గా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడం వెనుక ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నట్టు వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్​ తన సినీ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్​ విషయాలు పంచుకుంది. 

‘నటినయ్యేందుకు పేరెంట్స్​ను వదిలి ముంబై ట్రైన్​ఎక్కాను. రోజూ ఎంతో మంది దర్శకులు, క్యాస్టింగ్​ ఏజెంట్స్​కు ఫోన్​ చేసేదాన్ని. చాన్సుల కోసం గంటల కొద్దీ క్యూలో నిల్చునేదాన్ని. కొన్ని సార్లు చివరి నిమిషంలో సినిమా నుంచి నన్ను తీసేసేవారు. ఈ జర్నీలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా’ అని రకుల్​ తెలిపింది. ప్రస్తుతం ఇండియన్​ 2, అయిలాన్​ సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది.