ముగిసిన రాళ్లపల్లి అంత్యక్రియలు

ముగిసిన రాళ్లపల్లి అంత్యక్రియలు

సినీ నటుడు రాళ్లపల్లి వెంకటనర్సింహారావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు రాళ్లపల్లిని చివరిసారిగా చూసేందుకు ఎర్రగడ్డలోని ఆయన ఇంటికి అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చారు.  రాళ్లపల్లి భౌతికకాయానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.