Peddi Trailer Release: కుస్తీ బరిలో గ్లోబల్ స్టార్ ఊరమాస్ వేట.. రామ్‌చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది!

Peddi Trailer Release: కుస్తీ బరిలో గ్లోబల్ స్టార్ ఊరమాస్ వేట.. రామ్‌చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా.. లేటెస్ట్ గా ముంబయి వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈరోజు (మే 18) మధ్యాహ్నం 4:05 గంటలకు యూట్యూబ్‌లో విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది.

ఊరమాస్ అవతార్!

1980ల నాటి గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన విజువల్స్‌తో ట్రైలర్ అద్భుతంగా ప్రారంభమైంది. ముఖ్యంగా రామ్‌చరణ్ రెజ్లింగ్ (కుస్తీ) సీక్వెన్స్ పోస్టర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, ట్రైలర్‌లో ఆయన రగ్గడ్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్‌ లెవెల్‌లో ఉన్నాయి. "రంగస్థలం" తర్వాత చరణ్ మళ్లీ ఆ స్థాయి విలేజ్ మాస్ క్యారెక్టర్‌లో ఊగిపోయినట్లు స్పష్టమవుతోంది. కుస్తీ బరిలో చరణ్ అపోనెంట్స్‌ను ఉతికేసే యాక్షన్ ఎలిమెంట్స్ రొమాంచితంగా ఉన్నాయి.

ఎమోషన్, యాక్షన్ల కలబోత

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది. కథలో ఉన్న బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా సినిమా రన్‌టైమ్‌ను 3 గంటల 9 నిమిషాలు (189 నిమిషాలు) ఖరారు చేశారు. ట్రైలర్‌లోనూ అదే ఇంటెన్సిటీ కనిపించింది. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్‌చరణ్ మార్క్ యాక్షన్ పీక్స్ లో ఉన్నాయి. జాన్వీ కపూర్ పల్లెటూరి పడచుగా చరణ్ సరసన ఎంతో అందంగా మెరిసిపోగా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో 

రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచింది. ప్రతి సీన్‌ను తన సంగీతంతో మరింత ఎలివేట్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ గ్రాండ్‌నెస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి ‘పెద్ది’ సిద్ధమైపోయాడు. ఇక జూన్ 4న థియేటర్లలో మెగా విధ్వంసం చూడటమే తరువాయి..