KlinKaara: క్లీంకార సెకండ్ బర్త్ డే.. జూలో ఆ పులితో ఉపాసన స్పెషల్ పిక్.. అసలు కథ ఇదే!

KlinKaara: క్లీంకార సెకండ్ బర్త్ డే.. జూలో ఆ పులితో ఉపాసన స్పెషల్ పిక్.. అసలు కథ ఇదే!

రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లీంకార (Klin Kaara) నేడు (జూన్ 20న) తన రెండో పుట్టినరోజును జరుపుకుంటోంది. 2023 జూన్ 20 మెగా కుటుంబంలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్ క్లీంకార.. తన రాకతో మెగా కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చింది.

ఇవాళ క్లీంకార సెకండ్ బర్త్ డే సందర్భంగా ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. జూలో పులి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి, క్లీంకారతో ఉపాసన నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సందర్శించింది. అయితే, చిన్నారి క్లీంకారకి, హైదరాబాద్ జూలో తెల్ల పులితో ప్రత్యేక సంబంధం ఉంది. అవును, మీరు చదివింది నిజమే!వివరాలు చూసేయండి..

నేడు (జూన్ 20న) జూలో వైట్ టైగర్తో దిగిన ఓ ఫోటోను పంచుకుంటూ ఉపాసన ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఈ తెల్లపులికి, తన కూతురు క్లీంకార పేరునే పెట్టినట్లు పోస్ట్లో వెల్లడించింది. 

“సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి. నేడు, అది ఒక ఉల్లాసభరితమైన పులి. మా క్లింకారతో తన పేరును షేర్ చేసుకుంది. ఈ అందమైన సంజ్ఞకు హైదరాబాద్ జూకు ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాము. కానీ వాటి జీవితాలను గౌరవంగా మరియు జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మద్దతిస్తున్నామని” ఉపాసన తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. దీంతో సెలబ్రెటీల నుంచి అభిమానుల వరకూ.. అందరూ క్లీంకారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

క్లీంకార మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టి రెండేళ్లు అయినప్పటికీ.. ఆమె ఫేస్ని రివీల్ చేయలేదు. తాను పూర్తిగా ఎలా ఉందొ తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, అదిప్పటికీ జరగలేదు. అయితే, లేటెస్ట్ ఫొటోలో మాత్రం గతంలో కంటే ఇప్పుడు పర్లేదు అన్నంతగా క్లీంకార కనిపిస్తుంది.