భోళా కోసం రామ్ చరణ్.. ఏం చేస్తున్నాడో తెలుసా?

భోళా కోసం రామ్ చరణ్.. ఏం చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ అండ్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ భోళా శంకర్ ట్రైలర్(Bhola Shankar Trailer) రిలీజ్ చేయనున్నారు. జులై 27 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రానున్న ఈ ట్రైలర్ ను.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. జులై 27 సాయంత్రం యూట్యూబ్ లో మెగా రచ్చ ఖాయంగా కనిపిస్తోంది.

ఇక భోళా శంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో బ్యూటీ కీర్తి సురేష్(Keerthi Suresh) చిరుకి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. మహతి స్వర సాగర్(Mahati Swara Sagar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర(Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు.