మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (PEDDI). రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, చికిరి సాంగ్.. ఈ చిత్రంపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
ఈ క్రమంలోనే పెద్ది నుంచి ‘రై రై రా రా’ అంటూ సాగే రెండో పాట వచ్చేస్తోంది. ఈ పాట అప్డేట్ ఆదివారమే వచ్చిన.. టైం మాత్రం వెల్లడించలేదు మేకర్స్. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియావైపే లుక్కేస్తూ నిరీక్షిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ వెయిటింగ్ అర్ధం చేసుకున్న పెద్ది టీమ్.. పెద్ద మనసు చేసుకుని ‘రై రై రా రా’ పాట రిలీజ్ టైం అనౌన్స్ చేశారు.
పెద్ది రెండో పాటను ఇవాళ సోమవారం సాయంత్రం 7:02 గంటలకు విడుదల కానుందని బుచ్చిబాబు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘వచ్చేస్తున్నాం చరణ్ సార్.. ఈ సాంగ్లో మీ గ్రేస్ అలా చూస్తూ ఉండిపోయాం మా టీమ్ అంతా.. ఫుల్ సాంగ్ ఇవాళ సాయంత్రం 7:02 గంటలకు నుండీ రాయ్ రాయ్ సార్ ’’ అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.
►ALSO READ | Virosh Couple: తుమ్మన్‌పేటకు విజయ్-రష్మిక గ్రాండ్ ఎంట్రీ.. సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో వైరల్
‘ఈ పాట రామ్ చరణ్ ప్రతి అడుగులో దాగున్న శక్తిని, తన ప్రతి కదలికలో ఉన్న మనసు మంత్రాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండనుందని’ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే.. రామ్ చరణ్ తనదైన స్టెప్పులతో రఫ్ఫాడించినట్లుగా తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ క్రేజీ హుక్ మ్యూజిక్ అందించినట్లుగా సమాచారం. అనంత శ్రీరామ్ లిరిక్స్.. చరణ్ స్టెప్స్.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఫెస్టివల్ లోడింగ్ అన్నమాదిరిగా బుచ్చి వండిపెట్టినట్లుగా అర్ధమవుతుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే..నువ్వేమి పొడిచావనే..రై రై రా రా!! అనే లిరిక్ పదాలు వైరల్ గా మారాయి.
Ochestunam sirrr..
— BuchiBabuSana (@BuchiBabuSana) March 2, 2026
Ee song lo mee grace alaa chustu undipoyam maa team antha.. full song ochestundi sir..🫣
Eeroju 7:02 pm nundi Rai Rai sir 🔥#Peddi 🔥🔥🔥 #RaiRaiRaaRaa https://t.co/KSVPaZGq5F pic.twitter.com/gV4EwUU5yR
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
నీ అయ్య వడ్డీ...
— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026
నీ బిడ్డ కడితే…
నువ్వేమి పొడిచావనే!!
రై రై రారా రై రై రారా… 🔥🔥🔥
COMING SOON…
Nee Ayya Vaddee…
Nee Bidda Kadithe…
Nuvvemi Podichaavanee…
RAI RAI RAA RAA🔥🔥🔥
This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh
