రామ్ చరణ్ పక్కన ఉండే ఇంటర్నేషనల్ బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు ఎన్ని లక్షలు జీతమంటే?

రామ్ చరణ్ పక్కన ఉండే ఇంటర్నేషనల్ బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు ఎన్ని లక్షలు జీతమంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ( Peddi ) రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చరణ్ రగ్గడ్ లుక్ ఒకవైపు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటే.. ఆయన పక్కనే నీడలా నడుస్తూ నెట్టింట ఫుల్ ను క్రేజ్ సంపాదించుకున్నాడు ఒక కొత్త వ్యక్తి. అతడే రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట (Kevin Kunta). ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

ఎవరీ కెవిన్ కుంట?

కెవిన్ కేవలం ఒక సాధారణ బాడీగార్డ్ కాదు. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఈయన.. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో స్థిరపడ్డారు. అంతేకాదు, ఈయన ఒక ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్. 2021లో ఇటలీ జాతీయ MMA జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ట్రాక్ రికార్డ్ కూడా ఇతనికి ఉంది. అంతర్జాతీయంగా విఐపి, సెలబ్రిటీ ప్రొటెక్షన్ వర్క్‌లో ఇతను మోస్ట్ వాంటెడ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్.

 

నెలకు ఎన్ని లక్షలంటే?

 'పెద్ది' ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్‌కు క్లోజ్ ప్రొటెక్షన్ ఇస్తున్నందుకు గానూ కెవిన్‌కు రోజుకు రూ. 2 నుండి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ సెలబ్రిటీ బాడీగార్డ్స్ లీగ్‌లోకి కెవిన్ చేరిపోయినట్లే.   మరో వైపు స్టైలిష్ లుక్‌తో చరణ్ క్యాజువల్ దుస్తుల్లో కనిపిస్తుంటే.. కెవిన్ మాత్రం పర్‌ఫెక్ట్ టేలర్డ్ సూట్లు, షార్ప్ ఫార్మల్ వేర్‌లో మెరిసిపోతున్నాడు. అతని పొడవైన శరీరాకృతి, గంభీరమైన చూపు, స్టైలిష్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కి తగ్గట్టుగా సెక్యూరిటీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండాలనే ఉద్దేశంతోనే కెవిన్ కుంటను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్  వద్ద ' పెద్ది ' ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి...