Ram Gopal Varma: ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేరు..పూనమ్ పాండేపై వర్మ రియాక్షన్

Ram Gopal Varma: ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేరు..పూనమ్ పాండేపై వర్మ రియాక్షన్

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే(Poonam Pandey)..అంతేకాదు వివాదాస్పద నటి పూనం పాండే గురించి శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వీపరీతంగా వినిపిస్తోంది.పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్లు ఫిబ్రవరి 2వ తేదీన మొదలైన ఈ న్యూస్..అందరినీ షాక్ కలిగేలా చేసింది.ఇక అంతలోనే..తాను చచ్చిపోలేదు..అంతా నాటకం..కేవలం సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన తీసుకురావడానికి అంటూ వీడియో రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగజేసింది.

దీంతో పూనమ్ పాండే చావు డ్రామాపై నెటిజన్స్ నుంచి సినీ లవర్స్ వరకు విభిన్నమైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇక లేటెస్ట్గా సంచలన దర్శకుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)..పూనమ్ షేర్ చేసిన వీడియోపై స్పందించాడు. 

ఈ సమస్యపై మరింత దృష్టిని ఆకర్షించడానికి మీరు ఎంచుకున్న పద్ధతి.. కొంతమందికి అర్ధం అవ్వక నచ్చకపోవొచ్చు. కానీ, ఏ ఒక్కరూ మీ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా..అని వర్మ ప్రశంసలు కురుపించారు.  ప్రస్తుతం పూనమ్ వీడియోతో పాటు వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది.  

సర్వైకల్ క్యాన్సర్ ద్వారా తాను చనిపోక పోయినా.. ఈ వ్యాధికి చాలా మంది చనిపోతున్నారని.. ఈ క్యాన్సర్ పై అవగాహన కోసం ఇలాంటి ప్రచారాన్ని ఉపయోగించుకున్నట్లు స్పష్టం చేసింది పూనం పాండే. నేను బతికే ఉన్నాను.. సజీవంగా ఉన్నాను.. ఇప్పటి వరకు ఈ క్యాన్సర్ నన్ను చంపలేదు.. కాకపోతే వేలాది మందిని ఈ క్యాన్సర్ చంపుతుంది.. వారికి కనీస అవగాహన ఉండటం లేదు.. దీని కోసమే ఇలా చావు నాటకం ఆడినట్లు వెల్లడించింది పూనం పాండే.