
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతమైన సినిమా ఎలా సాధ్యమైంది అంటూ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Hey @PrasanthVarma and @tejasajja123 CONGRATULATIONS on the unanimous BLOCKBUSTER TALK ..Jai HANU-MAN ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2024
కథా, కథనం, గ్రాఫిక్స్,ఎమోషన్స్,ఎలివేషన్స్ ఇలా ప్రతీ పాయింట్ లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ స్టార్స్ సైతం సోషల్ మీడియా వేదికగా హనుమాన్ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా హనుమాన్ సినిమాపై తన అభిప్రాయాన్ని నెటిజన్స్ తో పంచుకున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. జై హనుమాన్.. అంటూ ట్వీట్ చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. థ్యాంక్యూ సర్.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు.