
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాపై కౌంటర్ వేశారు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola shankar) మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై, దర్శకుడు మెహర్ రమేష్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ సినిమా చిరు కెరీర్లో మరో డిజాస్టర్ మూవీగా నిలువనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్ ?
— Ram Gopal Varma (@RGVzoomin) August 12, 2023
ఇక ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్ పై వివాదాల దర్శకుడు వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వాల్తేరు వీరయ్య(Valteru Veerayya) ఎవరివల్ల ఆడిందో ప్రూవ్ చేయడానికి తీసినట్టుంది భోళా శంకర్ అంటూ ట్వీట్ చేశారు. అంటే వాల్తేరు వీరయ్య మూవీ విజయానికి కారణం చిరంజీవి కాదు రవితేజ(Raviteja) అని ఇండైరెక్ట్ గా కౌంటర్ వేశారు వర్మ. ట్వీట్ లో ఎక్కడ రవితేజ పేరు వాడలేదు వర్మ కానీ.. ఆ ట్వీట్ చూసిన నెటిజన్స్ మాత్రం రవితేజ, రవితేజ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆర్జీవీపై మండిపడుతున్నారు.