Jr.ఎన్టీఆర్ వాళ్ళ తాతకన్నా గొప్పోడు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Jr.ఎన్టీఆర్ వాళ్ళ తాతకన్నా గొప్పోడు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రం వ్యూహం(Vyooham). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా రెండో పార్ట్ శపథం(Shapadham) గా రానుంది. మొదటి పార్ట్ వ్యూహం ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ Jr. NTR వాళ్ళ తాత(సీనియర్ ఎన్టీఆర్) కన్నా గొప్పోడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ అటు రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వ్యూహం,శపథం సినిమాల ట్రైలర్ రిలీజ్ సందర్బంగా మీడియాతో ముచ్చటించారు మేకర్స్. ఇందులో భాగంగా రఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులుగా మాట్లాడుతూ.. నా దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అది ఏ విషయంలో అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు వర్మ. ఇక మరో రిపోర్టరెమో.. డిసెంబర్ 31న జూనియర్ ఎన్టీఆర్ పై ట్వీట్ చేశారుగా రిప్లయ్ వచ్చిందా అని అడిగారు. దానికి సమాధానంగా.. ఆ ట్వీట్ వోడ్కా తాగిన టైంలో చేసుంటా.. అంటూ తనదైన స్టాల్లో ఆన్సర్ ఇచ్చాడు వర్మ. ఇక ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా? అని మరో రిపోర్టర్ అడగగా.. నాకు అంత కెపాసిటీ లేదని చెప్పుకొచ్చాడు వర్మ. 

Also Read: ప్రేమికుల రోజున తన బ్రేకప్ కథలు చెప్పిన సందీప్.. పాపం ఒక్కటి కూడా!