Ramgopal Varma: పోర్న్ చూసినట్టు చూస్తారు.. వ్యూహం సినిమాపై వర్మ షాకింగ్ కామెంట్స్

Ramgopal Varma: పోర్న్ చూసినట్టు చూస్తారు.. వ్యూహం సినిమాపై వర్మ షాకింగ్ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసినా వివాదమే. సినిమాల కోసం ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఎవరు టచ్ చేయని పాయింట్స్ ను టచ్ చేస్తూ వైరల్ అవడం ఆయనకు అలవాటే. తాజాగా మరోసారి అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు  వస్తున్నారు వర్మ. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమాలు వ్యూహం(Vyuham),శపథం(Shapadham). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పలు వివాదాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాలు వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చ్ 1న థియేటర్స్ లోకి వస్తున్నాయి. 

తాజాగా ఈ సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపధం సినిమాల గురించి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాను జనాలు బాగా చూస్తారు. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన వాళ్లే ఎక్కువగా చూస్తారు. కాకపోతే.. డైరెక్ట్‌గా థియేటర్లకు వెళ్లరు, దాక్కుని వెళ్లి చూస్తారు. కొంతమంది బాత్రూముల్లో రహస్యంగా చూస్తారు. నేను పోర్న్ సినిమాలు చూసినట్టు టీడీపీ, జనసేన వాళ్లు మా వ్యూహం సినిమా చూస్తారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజం చెప్పలంటే ఈ రెండు సినిమాలపై బయట పెద్దగా బజ్ లేదు. కొంతమందికి ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. కాబట్టి.. పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి వర్మ అన్నట్టుగానే ఈ సినిమాను ఎంతమంది ఎలా చూస్తారు అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.