రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నాడు. తన కెరీర్‌లో 23వ చిత్రం కాగా, ర్యాపో 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది.
ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే తొమ్మిది రోజుల షూట్ జరిగింది.ఇందులో భాగంగా వర్షాల కారణంగా షూటింగ్‌కు పలుమార్లు బ్రేక్ వచ్చినప్పటికీ టీమ్ మాత్రం ప్లాన్ ప్రకారం సన్నివేశాలను పూర్తి చేసేందుకు శ్రమించారట.
ముఖ్యంగా ఒక సందర్భంలో రామ్ పోతినేని ఏకంగా 24 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హీరోగా కెమెరా ముందు నటించడంతో పాటు, దర్శకుడిగా కెమెరా వెనుక బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న రామ్.. సినిమాపై ఆయనకున్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది.
ఈ చిత్రాన్ని యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
