రామం రాఘవం మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

రామం రాఘవం మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇరవై రెండు మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి అభినందనలు తెలియజేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తండ్రీ కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నారు.

‘హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నామని, గతంలో ఎప్పుడూ చూడని ఓ తండ్రీకొడుకుల కథను ఇందులో చూపించబోతున్నాం’ అని దర్శకుడు ధనరాజ్ చెప్పాడు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా, అరుణ్ చిలువేరు సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.