రామప్పలో వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్..వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలి

రామప్పలో వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్..వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలి
  •    12  రోజులు నిర్వహించనున్న శిక్షణ క్యాంపు
  •     10 రాష్ట్రాలకు  చెందిన 35 మంది వలంటీర్స్ కు శిక్షణ
  •     సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ  వీసీ  శ్రీనివాస్

వెంకటాపూర్( రామప్ప ),వెలుగు :   తెలంగాణ పర్యటక శాఖ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్  శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 35 మంది వాలంటీర్స్ 12 రోజులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వీసీ  శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై యువత అవగాహన పెంచుకొని, వాటి ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియజేయాలని సూచించారు.  పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, భూగర్భ శాస్త్రం వంటి పలు అంశాలను తెలుసుకునేందుకు ఈ శిబిరం విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. 

జిల్లా పర్యాటక నోడల్ అధికారి డాక్టర్ ఎ. ధర్మానాయక్ మాట్లాడుతూ శిబిరం నిర్వహణకు పర్యాటక శాఖ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. కాగా, రామప్పకు యునెస్కో గుర్తింపు  లభించినప్పటి నుంచి వరుసగా ఐదోసారి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు,శిబిర సమన్వయకర్త శ్రీధర్ రావు, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ పరిరక్షణ సహాయకుడు భార్గవ్, పర్యాటక శాఖ సహాయ పర్యాటక ప్రోత్సాహక అధికారి డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, ఆలయ పూజారులు ఉమాశంకర్, హరిశంకర్, పర్యాటక శాఖ సిబ్బంది, పర్యాటక పోలీసులు, ఆలయ సిబ్బంది, పర్యాటక మార్గదర్శకులు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.