Ramanyan Trailer Review: హాలీవుడ్‌కే షాకిచ్చేలా 'రామాయణం'.. యశ్ రౌద్రరూపం.. రణ్‌బీర్ దివ్యరూపం.. ట్రైలర్‌తో గ్లోబల్ వైబ్స్!

Ramanyan Trailer Review: హాలీవుడ్‌కే షాకిచ్చేలా 'రామాయణం'.. యశ్ రౌద్రరూపం.. రణ్‌బీర్ దివ్యరూపం.. ట్రైలర్‌తో గ్లోబల్ వైబ్స్!

భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టాలన్న నమిత్ మల్హోత్రా కల నిజమయ్యే దిశగా మరో భారీ అడుగు పడింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' అంతర్జాతీయ ట్రైలర్ ను బెంగళూరు వేదికగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే భారతీయ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమైందనే భావన కలుగుతోంది.

విజువల్స్ చూస్తే గూస్‌బంప్సే!

రామాయణం ట్రైలర్‌లో కనిపించిన భారీ యుద్ధాలు, అద్భుతమైన లోకాలు, భీకరమైన రాక్షస సైన్యాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా DNEG రూపొందిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయి ఫాంటసీ సినిమాలను గుర్తుచేస్తున్నాయి. పుష్పక విమానం, రావణుడి రౌద్రరూపం, యుద్ధ సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే కొన్ని విజువల్స్‌లో CGI సహజత్వంపై ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

యశ్ వర్సెస్ రణ్‌బీర్.. 

రావణుడిగా యశ్ కనిపించిన తీరు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఆయన ఆహార్యం, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. మరోవైపు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండగా, ఇంద్రదేవుడిగా కునాల్ కపూర్ తొలిసారి ట్రైలర్‌లో దర్శనమిచ్చారు.

గ్లోబల్ మ్యాజిక్..

ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి అందిస్తున్న సంగీతం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో సోనీ పిక్చర్స్ ప్రచారం ప్రారంభించింది. విదేశీ మార్కెట్లలో ట్రైలర్ విడుదలైన వెంటనే టికెట్ల విక్రయాలు కూడా మొదలయ్యాయి. 

అయితే ట్రైలర్‌పై ప్రశంసలతో పాటు CGIపై విమర్శలూ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నం మాత్రం భారీ స్థాయిలో సాగుతోంది. దాదాపు రూ4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా, యష్ నిర్మించిన ఈ ఎపిక్ వండర్, రెండు భాగాల సిరీస్‌లో మొదటిదిగా రాబోతోంది. నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.